ప్ర : జి .ఎస్ . టి . ఎన్ (GSTN Provisional ID) ప్రొవిజినల్ ఐ . డి . ని గుర్తు పెట్టు కోవడం ఎలా ?
మార్గం కృష్ణ మూర్తి .,
జ : జి .ఎస్ . టి . ఎన్ (GSTN Provisional ID) ప్రొవిజినల్ ఐ . డి . గుర్తు పెట్టు కోవడం చాలా సులువు . ముందుగా ఆ నెంబర్ ఎలా తయారయ్యిందో విశ్లేషిస్తే మనకు ఆ ఐ . డి . గుర్తు పెట్టుకోవడం చాలా సులువు అవుతుంది .
ప్రతి , జి .ఎస్ . టి . ఎన్ (GSTN Provisional ID) ప్రొవిజినల్ ఐ . డి . లో 15 నెంబర్లు ఉంటాయి. అవును కదా . అందులో మొదటి 2 నెంబర్లు రాష్ట్రానికి సంబందించినవి . ఉదా : తెలంగాణా రాష్ట్రానికి కోడ్ ' 36 ' . ఇది వ్యాట్ (VAT) లో కూడా ఉంది , మనకు తెలుసు .
ఆ తరువాత వచ్చే 10 నెంబర్లు , ఆ కంపెనీ యొక్క పాన్ నెంబర్ (PAN NUMBER) . ఇదీ మనకు తెలుసు . ఇప్పటికి 12 నెంబర్లు తెలుసుకున్నాం . ఇక 13 వ నెంబర్ '1' . ఇది పాన్ ని తెలియ జేస్తుంది . ఉదా : రామ్ & కో కంపెనీ హైదరాబాద్ లో 'జి ఎస్ టి ' లో రిజిస్టర్డు అయ్యింది . ఇక్కడి అడ్డ్రస్ తోటే పాన్ నెంబర్ (PAN NUMBER) తీసుకున్నారు . హైదరాబాద్ తెలంగాణా రాష్ట్రానికి చెందినదే . కాబట్టి , రామ్ & కో కంపెనీ కి 13 వ నెంబర్ '1' . అదే గుజరాత్ రాష్ట్రం లో పాన్ నెంబర్ (PAN NUMBER) తీసుకుని , హైదరాబాద్ లో 'జి ఎస్ టి ' లో రిజిస్టర్డు అవుతే , ఆ 13 వ నెంబర్ వేరే గా ఉంటుంది . ఇక్కడి వరకు పూర్తిగా అర్ధమయ్యే ఉంటుంది అనుకుంటాను .
ఇక 14 వ నెంబర్ ' Z ' . అన్నిటి కి కామన్ గా తీసుకున్నారు .
చివరిగా 15 వ నెంబర్ ఏదైనా ఆంగ్ల అక్షరం ఉండ వచ్చు . ఉదా : A లేదా B లేదా C లేదా .....Z ఏదైనా ఉండ వచ్చు . కాబట్టి కేవలం ఆ ఒక్క 15 వ అక్షరం గుర్తు పెట్టుకుంటే , మీకు 15 నెంబర్ల జి .ఎస్ . టి . ఎన్ (GSTN Provisional ID) ప్రొవిజినల్ ఐ . డి . సులువుగా గుర్తుకు ఉన్నట్లే కదా .
మరిన్ని సులువైన పద్దతుల కొరకు వేచి చూడండి .
Comments
Post a Comment