ప్ర : పక్షాలను గుర్తు పెట్టుకోవడం ఎలా ?
మార్గం కృష్ణ మూర్తి .
జ ; మనకు సాధారణముగా ప్రతి నెలకు 2 పక్షాలు ఉంటాయి . ఒకటి కృష్ణ పక్షం . రెండవది శుక్ల పక్షం . ఒక్కో పక్షానికి 15 రోజులన్న మాట . ఇవే పక్షాలు ప్రతి నెలా వస్తాయి . అయితే వీటిని అనగా ఏ 15 రోజులు కృష్ణ పక్షం , ఏ 15 రోజులు శుక్ల పక్షం అనే దానిని గుర్తుపెట్టుకోవడం పెద్ద వారికీ కూడా చాల కష్టం గానే ఉంటుంది .
వీటిని గుర్తు పెట్టుకోవడం చాలా సులువు . మనకు బాగా తెలుసు , కృష్ణుడు నలుపుగా ఉంటాడు. అవును కదా . శుక్ర గ్రహం భూమికీ దగ్గరగా ఉండటం వలన చాల ప్రకాశ వంతంగా ఉంటుంది . అవును కదా . అందుకని , ఎప్పుడైతే పాడ్యమి నుండి మొదలయ్యే రోజులలో చీకటి పెరుగుతూ ఉంటే , అది కృష్ణ పక్షమని , అలానే పాడ్యమి నుండి వెన్నెల పెరుగుతూ ఉంటే అది శుక్ల పక్షమని గుర్తు పెట్టు కొండి . కృష్ణ పక్షానికి చివరి రోజు (15 వ రోజు ) అమావాస్య అవుతుంది . అలానే శుక్ల పక్షానికి చివరి రోజు ( 15 వ రోజు ) పౌర్ణమి లేదా పున్నమి అవుతుంది . సులువుగా ఉంది కదూ .
మరిన్ని సులభ పద్ధతుల కొరకు వేచి చూడండి .
Comments
Post a Comment